9908715828
contact@dharmaveer.org
dharmaveer

భారతదేశం సువిశాలమైన, సుసంపన్నమైన దేశం...మన దేశాన్ని ఆర్యవర్తమని, దేవ భూమి,స్వర్ణ భూమి, పుణ్యభూమి ,వేద భూమి అని అంటారు.... గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, నర్మదా, గోదావరి, కృష్ణా, తుంగభధ్ర వంటి పుణ్యనదులతో సస్యశ్యామలమై విరాజిల్లే పుణ్యధాత్రి...ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము , ఈశ, కేన, కఠ, ప్రశ్న, ఐత్తరేయ, తైత్తరేయ, ముండక, మాండూక్య, చాందోగ్య, బృహదారణ్యక, శ్వేతాశ్వతర ఇత్యాది 108 ఉపనిషత్తులు , 18 పురాణాలు,రామాయణ , మహాభారతం వంటి ఇతిహాసాలు, భగవద్గీత అనేక ధార్మిక గ్రంధాలతో నిండిన జ్ఞాన భాండాగారం

ఇటువంటి సుసంపన్నమైన, విజ్ఞానాన్ని ఇచ్చిన భారతదేశం పై అనాదిగా అనేక రూపాల్లో చరిత్ర వక్రీకరణలు, గ్రంధాల వక్రీకరణ జరిపి భారతీయులను మభ్యపెడుతూ మతమార్పిడి చేస్తున్నారు..

మన సంస్కృతీ సాంప్రదాయలు, ఆచార వ్యవహారాలు మంటకలిసిపోతున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, స్వామి వివేకానంద వంటి మహోన్నతులు తిరిగి మన పూర్వ వైభవాన్ని తీసుకురాడానికి ఎంతగానో కృషి చేసారు.. పాశ్చాత్య దాడుల నుండి మన దేశాన్ని కాపాడడానికి ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేసారు.. వారి త్యాగాలను వృధా కానీయరాదు.. ఈనాటికి ఈ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి..అనేక బహిరంగ ప్రదేశాల్లో మన దేవీదేవతలను దూషిస్తున్నా పట్టించుకొనే నాధుడులేడు..

ఈ నేపధ్యంలో నిర్లిప్తంగా, బాధ్యతా రాహిత్యంగా ఉన్న హిందు సమాజాన్ని నిద్రలేపుతూ మన చరిత్ర, గ్రంధ పరిజ్ఞానాన్ని ఇవ్వడానికి , సమాజ పోకడలను, మన దేశంపై ధర్మంపై వివిధ రూపాల్లో జరుగుతున్న దాడులను, కుట్రల గురించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచడానికి అక్టోబర్ 28, 2018 న “ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక “ ఉధ్భవించినది..నేటికీ అనేక గ్రామాలలో “దేశకోసం ధర్మంకోసం – అవగాహన సదస్సు” లు నిర్వహించి వందల సంఖ్యలో “ధర్మవీర్ “లను తయారుచేసి ధర్మరక్షణలో తనవంతు బాధ్యతవహిస్తుంది...

Our Activities

  1. మన దేశ చరిత్ర, ధర్మవిశిష్టత ప్రతీ హిందు బంధువుకు తెలియజేయుట
  2. చిన్ననాటి నుండీ పిల్లలకు దేశభక్తి పెంపొందించేలా తల్లిదండ్రులకు దిశానిర్దేశం ఇవ్వడం
  3. ప్రతీ హిందువు కనీసం ఒక హిందు గ్రంధాన్నైనా పెట్టుకొని, చదవడం వాటి గురించి తెలుసుకోవడం
  4. సెక్యులర్ భావాల వలన హిందువులకు కలుగుతున్న నష్టాలు తెలియజేసి స్వచ్చమైన హిందువుగా తయారుచేయడం
  5. గ్రామగ్రామాన క్షేత్రస్థాయిలో యువతను చైతన్యపరచి వారి సమస్యలను వారే పరిష్కరించుకొనేలా చేయడం
  6. కరపత్రాల ద్వారా మన దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను, ప్రస్తుత వక్రీకరణలు, రాజ్యాంగం పై, చట్టాలపై అవగాహన కల్పించడం

ఈ యజ్ఞంలో ప్రతీ హిందువు పాలుపంచుకొని మన దేశాన్ని ధర్మాన్ని కాపాడాలని మన సంస్కృతీ సాంప్రదాయాలకు తిరిగి పూర్వ వైభవాన్ని తేవాలని ఆకాంక్షిస్తున్నాము..దీనికి “ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక “ భరోసా ఇస్తూ తోడ్పాటునిస్తుంది..